శ్రీనిధి లోన్ ఆలస్యంగా జమ చేశారు ....పై అధికారులకు నివేదిక అందిస్తాం

Sep 25, 2026 - 22:15
 0  3
శ్రీనిధి లోన్ ఆలస్యంగా జమ చేశారు ....పై అధికారులకు నివేదిక అందిస్తాం

  తెలంగాణ వార్త ఎఫెక్ట్....

శ్రీనిధి ఉపాధి లోన్ గోల్ మాల్ వార్తతో కదిలిన జిల్లా యంత్రాంగం ....

జలాల్పురం సంఘ బంధంలో విచారణ జరిపిన జిల్లా అధికారులు....

సభ్యులు కట్టిన బకాయి వెంటనే జమ చేయలేదు......

 ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆలస్యంగా జమ చేసింది ........

రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం

బాధితుల ఆరోపణ నిజమే .......

ఏపీఎం లక్ష్మి సిసి నాగయ్యకు తెలిసే జరిగింది బాధితుల ఆవేదన..... 

తక్షణమే వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని బాధితుల ఆరోపణ.. ...... 

తిరుమలగిరి 26 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండలంలో జలాల్పురం గ్రామ సంఘ బంధంలో జరిగిన అవకతవకలు జరిగాయని ఈనెల 16వ తేదీన జిల్లా కలెక్టర్ కు మరియు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు ఇట్టి ఫిర్యాదుపై డిఆర్ డిఓ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం గ్రామంలో సర్పంచ్ గణేశ్వరి, సంఘ బంధం సభ్యుల సమక్షంలో ఒక్కొక్క సంఘ బంధ సభ్యులను దాదాపు ఐదు గంటలు పూర్తి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్ మాట్లాడుతూ జలాల్పురం సంఘ బంధంలో శ్రీనిధి లో అవకతకులు జరిగాయని, నిధులను అధ్యక్షురాలుకు తెలపకుండా డ్రా చేశారని జిల్లా డిఆర్ డి కు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరిపామని తెలిపారు. బాధితులు ముత్తినేని మానస గుమ్మడవెల్లి రుక్మిణి తెలిపిన ప్రకారం సంఘ బంధంలో జరిగిన అవకతవకలో డబ్బులు సమానంగా జమ చేయడం జరిగింది కానీ సంఘ బంధం సభ్యులు కట్టిన డబ్బులను వెంటనే జమ చేయకుండా ఆలస్యంగా అప్పుడప్పుడు అనగా రెండు నెలలకు ఒకసారి 25,000 15000 ఆన్లైన్ పేమెంట్ ద్వారా 40,000 రూపాయలు జమ చేయడం జరిగింది ఈ విచారణ పై డిఆర్ డి ఓ కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ విచారణలో మార్కెటింగ్ డిపిఎం అరుణ్ కుమార్, శ్రీనిధి ఆర్ఎం శివప్రసాద్, ఏపీఎం లక్ష్మి, సీసీ నాగయ్య, వివో ఏ అనంతలక్ష్మి,వివో కార్యదర్శి, కోశాధికారి, కనకదుర్గ, భువనేశ్వరి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి