తిరుమలగిరిలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

తిరుమలగిరి 21 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని పూలే అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మహాజన సోషలిస్టు పార్టీ (MSP) ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ కందుకూరిసోమన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం ఇది మూడు దశాబ్దాల పోరాటమని కేవలం ఈ పోరాటాన్ని నడిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ అలుపెరగని రాజీలేని పోరాటం ద్వారా మాత్రమే వర్గీకరణ సాధ్య మైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో.. సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్త గట్టు మల్లయ్య. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీను మాదిగ విహెచ్ పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల వెంకన్న ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం తిరుమలగిరి మండల అధ్యక్షులు కందుకూరి రవి మాదిగ ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి టౌన్ నాయకులు కందుకూరి మహేష్ మాదిగ. ఎమ్మార్పీఎస్ నాగారం డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు వంగూరు నరేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ డప్పు కళాకారుల సంఘం తిరుమలగిరి మండల కార్యదర్శి కొమ్ము సోమయ్య ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల నాయకులు జేరిపోతుల కొండయ్య బోడ సోమయ్య పత్తేపురం పరుశరాములు కందుకూరి సుధీర్ కందుకూరి చంద్రయ్య కందుకూరి సోమయ్య (డబ్బా) కందుకూరి కుమార్ బోడ బిక్షపతి వనగండ్ల రమేష్ ఎర్ర రవి ఎర్ర పెద్ద రవి గద్దల అనుదీప్ పత్తేపురం అరుణ్ బోడ వెంకట్ మల్లెపాక అనిల్ బోడ సాయి కందుకూరి భరత్ వంగాల వరుణ్ ఉడుగు నితీష్ కందుకూరి సిద్ధార్థ వంగాల రాఘవ తదితరులు పాల్గొన్నారు.