తవ్వారు ....వదిలేశారు
తిరుమలగిరి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం...
ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో డ్రైనేజీల పనులు నత్త నడకన సాగుతున్నాయి అయితే పనులు పూర్తి కాకపోవడంతో డ్రైనేజీల కోసం తీసిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి గుంతలపై ఎలాంటి కప్పు వేయకపోవడంతో పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రమాదవశాత్తు గుంతలో పడితే ప్రాణాలకు ప్రమాదమని కాలనీవాసులు అంటున్నారు వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు