తల్లి మరణం తండ్రి అనారోగ్యంతో నిర్జీవ పోరాటం
తల్లిదండ్రుల్లారా మీకు పుట్టిన పిల్లల కోసం మీ ఆరోగ్యాలు జాగ్రత్త.
చెడిపోతే చెట్లయినా తోడు కావు అనే పెద్దల సామెత యాదిలో ఉంచుకోరి.
జోగులాంబ గద్వాల 17 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల పట్టణం కోట ప్రక్కన సోమనాద్రి కాలనీలో, శ్రీ అభయాంజనేయ స్వామి గుడి ప్రక్కన ముష్టి పరశురాముడు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
సహాయం కోసం ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్న తండ్రి ఎదురుచూపులు.
వీరి ఫోన్ నెంబర్ 9966278599
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రధాన పార్టీ వాళ్లు, ప్రధాన నాయకులు అందరూ చూసి ముక్కు మూసుకొని పోయిన వాళ్లే.
మానవతావాదం చూపిన మనుషులు మాత్రం కమ్యూనిస్టులే. పరశురాముడు చిన్న కుమారుడికి హ్యాండ్సప్, ఎందుకంటే చిన్న వయసులోనే తండ్రి కోలుకోవడం కోసం మానవతవాదం చూపుతూ మా నాయన అనే గొప్ప బాధ్యతతోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా పెరిగే వయసులో వెలకట్టలేని బాధ్యత తోటి తను స్కూల్ కి వెళ్లకుండా ఎంతో ధైర్యం తోటి వాళ్ళ నాన్నకు సేవ చేస్తున్నాడు భారత కమ్యూనిస్టు పార్టీ CPI నాయకులు 30వ వార్డు అభ్యర్థి న్యాయవాది కోట రమేష్ , CPI జిల్లా కార్యదర్శి B.ఆంజనేయులు, కామ్రేడ్ రంగన్న ఎల్కూర్, గద్వాల్ నరసింహ, గంజిపేట ఆటో డ్రైవర్ లక్ష్మన్న, ఇంటి పక్క వారి సహాయంతో గత మూడు రోజులుగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం అతన్ని తీసుకెళ్లి అడ్మిషన్ చేసి, వైద్యం చేయించడం జరిగింది,ఇంకా మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లిన చిన్న చిన్న అవసరాలకు వీరి దగ్గర డబ్బులు లేవు, అలాగే అతన్ని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు, చిన్న కొడుకు మాత్రం నేనుంటా మా నాన్నను చూసుకుంటా హాస్పిటల్లో అంటున్నాడు కానీ అతన్ని మహబూబ్నగర్ హాస్పిటల్ కి తీసుకెళ్లే బాధ్యత ఎవరు తీసుకోవడం లేదు. కావున అందరూ తక్షణమే కనికరించి ఎవరికి చేతనైనంత మనము వారికి ఆర్థిక సాయం చేస్తే కనీసము మనం చేసే ఆర్థిక సహాయంతోనైనా మహబూబ్నగర్ ఆస్పత్రిలో అడ్మిషన్ చేయొచ్చని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.
Plz help 9966278599 గద్వాల కోట,సోమనాద్రి కాలనీ ముష్టి పరశురాముడు