డబుల్ ఓటు వద్దు.. సింగిల్ ఓటే ముద్దు
రెండు చోట్ల ఓటు ఉండటం నేరం..
సర్ ప్రక్రియకు ప్రతి ఓటరు సహకరించాలి
ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.
గద్వాల 27 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి : డబుల్ ఓటు వద్దు.. సింగిల్ ఓటే ముద్దు అని సర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటిక్యాల తాసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాతర్ల గ్రామంలో శనివారం ఇటిక్యాల రెవిన్యూ ఇన్స్పెక్టర్ మధు కుమార్ (సూపర్వైజర్.) బీఎల్‌ఓ , బి ఎల్ ఎ .జిపిఓ.ఈశ్వర్. తదితరులు వెళ్లి కుటుంబ సభ్యులకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ....ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ప్రతిఒక్కరికి ఒకే ఓటు మాత్రమే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు చోట్ల ఓట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారమేనని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తన ఓటుకు తానే బాధ్యుడని, అనవసరంగా ఒక ఊరిలో ఒక ఓటు, తాను నివసించే మరో ప్రాంతంలో ఇంకో ఓటు నమోదు చేసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలకు సూచించారు. రెండు ఓట్లు కలిగి ఉండటం పూర్తిగా నేరమని హెచ్చరించారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తన ఓటును సరైన ప్రాంతంలో నమోదు చేసుకునేలా అధికారులకు సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.