ట్రాఫిక్ నియంత్రణ విధులకు ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన
హైదరాబాద్ ట్రాఫిక్. నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..
సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తు తం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్య మంత్రి సూచించారు.
ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారు లకు ఆదేశించారు.
వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందిం చాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు...