టీఎస్పీఎస్సీ మెంబర్ తో జీవో నెంబర్ 46 పై చర్చించిన మునగాల యువకులు

మునగాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్ గా నియమితులైన పాల్వాయి రజని కుమారి ని మునగాల మండల కేంద్రానికి చెందిన యువకులు శుక్రవారం రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి బొకే అందించి దుశ్యాలువా తో సన్మానించి శుభాకాంక్ష తెలియజేసి ,జీవో 46 గురించి చర్చించటం జరిగింది. అనంతరం టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్ రజనీకుమారి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 46 గురించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు...ఈ కార్యక్రమంలో మీసేవ శర్మ,సిరికొండ సతీష్,సిరి కొండ అజయ్, లొడంగి గోపి, పాల బిందెల నవీన్, బత్తిని తరుణ్,పసుపులేటి సందీప్ సాయి తదితరులు పాల్గొన్నారు....