టిఎస్ జేఏ మండల అధ్యక్షులుగా కొండా రవి నియామకం

Jun 28, 2025 - 16:30
Jun 28, 2025 - 19:09
 0  8
టిఎస్ జేఏ మండల అధ్యక్షులుగా కొండా రవి నియామకం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ జేఏ ) ఆత్మకూర్(ఎస్) మండల అధ్యక్షులుగా యంగ్ ఇండియా న్యూస్ తెలుగు జర్నలిస్టు కొండా రవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు శనివారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరికి అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఉమ్మడి జిల్లా కమిటీ, సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ నియవ నిబంధనలకు కట్టుబడి పని చేస్తానని తెలిపారు.