జిల్లా కోఆర్డినేటర్స్ అధికారులతో జూమ్ మీటింగ్
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
ఎల్ల ఆర్ ఎస్ పై జిల్లా విద్య శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
జగిత్యాల (District)
బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తన ఛాంబర్ లో అన్ని మండలాల ఎంపిఓ, మున్సిపల్ కమిషనర్ జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి టీ పి ఓ. రాబో యే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో జిల్లా కోఆర్డినేటర్స్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు.
అన్ని మండలాల వారీగా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ పరిధిలో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను ఒక్కో వార్డులో మూడు దరఖాస్తులను చొప్పున ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు రుసుము చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే ప్రతి ఒక్క పంచాయతీ లో ప్రతి రోజు 50 దరఖాస్తులు ఎల్ ఆర్ ఎస్ రుసుము చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఓ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
పదవ తరగతి 2024-25 విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వర్చ్యువల్ (జూమ్) సమావేశం ద్వారా విద్యార్థులతో దిశా నిర్దేశం చేశారు.
2024-25 విద్య సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులతో వర్చ్యువల్ (జూమ్) మీటింగ్లో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి భయాందోళన చెందకుండా పదవ తరగతి పరీక్షలను పూర్తి సన్నద్ధ తతో ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలను సాధించాలని వారికి సలహాలను సూచనలను ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కలెక్టర్ సూచించిన 'పంచసూత్రాలను' పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాలని విధ్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో ,డిపిఓ మధన్ మోహన్, జిల్లా విద్యా అధికారి, రాము, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.