జిల్లాలో 2530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ...

పోలింగ్ సరళిని పరిశీలించిన.....
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట 27 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట ఆనంద విద్య నిలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. Avm పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లలకు గాను 935 ఓట్లు పోలయ్యాయి,దానిలో పురుషులు 548, స్త్రీలు 387 ఓట్లు వేసారని అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2664 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు 2530 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డిఎస్పి రవి, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు