జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా“మోకనపల్లి బద్రి” ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా గోపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిపురం మధు ఎన్నిక నిజాయితీకి దక్కిన గౌరవం
జిల్లా జర్నలిస్టుల రక్షణకై ..అహర్నిశలు కృషి చేస్తానన్న “బద్రి”
మందమర్రి 29 మార్చి 2026. తెలంగాణవార్త రిపోర్టర్:– మంచిర్యాల జిల్లాలోని ‘కిడ్స్ ప్లే స్కూల్” ఆవరణంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన జర్నలిస్టు మిత్రులు పాల్గొని సీనియర్ పాత్రికేయులు ‘మోకనపల్లి బద్రి’ని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డిని,వైస్ ప్రెసిడెంట్‌గా డి.వెంకటేష్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిరిపురం మధు,జిల్లా ఉపాధ్యక్షులుగా రాజయ్య,శనిగారపు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా స్వామి,అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుషనపల్లి సతీష్,మాదాసు శ్రీకాంత్ యాదవ్,బత్తుల సతీష్‌లను ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా సభ్యులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోకనపల్లి బద్రి మాట్లాడుతూ.. నా మీద నమ్మకాన్ని ఉంచి జిల్లా అధ్యక్ష పదవి బహుకరించిన జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు సంక్షేమ సంఘం సభ్యులు అదేవిధంగా తోటి జర్నలిస్టు సభ్యులకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని, జర్నలిస్టుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తానని,ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాసాని రమేష్, సిరిపురం మధు,దుర్గం వెంకటేష్,కుశన పెల్లి సతీష్, డాక్టర్ స్వామి,ఠాగూర్ సుశీల్,శేఖర్,ఆంజనేయులు,శ్రీ కాంత్ యాదవ్,బీజోన్ రవి, శనిగారపు వెంకటేష్,జైపూర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర కార్యవర్గంలోకి మంచిర్యాల నుంచి ఎన్నిక జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు మాదాసు శ్రీకాంత్ యాదవ్,కుశనపల్లి సతీష్,బత్తుల సతీష్‌లను నియమించినట్లుగా జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు.త్వరలోనే మంచిర్యాల జిల్లాలో మరిన్ని నియామకాలు చేస్తామన్నారు.జర్నలిస్టుల పక్షాన జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహించామని రానున్న రోజుల్లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మరింతగా పోరాటం చేస్తామన్నారు.చిన్న పిలుపు మేరకు ఈ స్థాయిలో మంచిర్యాల జిల్లా నుంచి జర్నలిస్టుల నుంచి స్పందన రావడం అభినందనీయమన్నారు.వారు తమ మీద ఉంచిన విశ్వాసాన్ని ఎన్ని ఒడుదొడుకులొచ్చినా తప్పక నిలబెట్టుకుంటామన్నారు. గతంలో వివిధ కారణాలతో అనైక్యంగా ఉన్న జర్నలిస్టు మిత్రులంతా జర్నలిస్టుల సంక్షేమంలోకి తిరిగి రావాలని పిలుపునిచ్చారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి అనూహ్య మద్దతు దక్కుతోందని తెలిపారు. జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపును ప్రతీ పాత్రికేయుడికి రక్షణగా నిలవడమే కాక వారికి వృత్తిలో తగు శిక్షణ ఇచ్చి వారిని మెరుగైన పాత్రికేయులుగా తీర్చిదిద్దుతామన్నారు.