జమ్మిబండ నారాయణ పాఠశాలలో అకాడమిక్ ప్రదర్శన
ఖమ్మం : జమ్మిబండ నారాయణ పాఠశాలలో విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఆకట్టుకునే ప్రాజెక్టులను ప్రదర్శించారు . ఈ అకడమిక్ ఫెయిర్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే విధంగా అందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని కలిగించింది . ఈ కార్యక్రమంలో ఏజీఎం రాంకి , సెంచరీ స్కూల్స్ అధినేత ప్రభాకర్ సతీమణి గవర్నమెంట్ టీచర్ మాధవి , జెడ్ సి ఓ ప్రవీణ్ , ఆర్ ఐ క్రాంతి , ప్రిన్సిపల్ రేఖ , ఏ ఒ నరసింహారావు , పి ఈ టి రాము తదితరులు పాల్గొన్నారు .