చిర్రగూడూర్ గ్రామంలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
అడ్డగూడూరు 13 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చిర్రగూడూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు కాలాలపాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు. రైతులు పండించిన పంట ప్రతి గింజ మద్దతు ధర కింటా కి 2389 రూపాయలకు కొనుగోలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,తాసిల్దార్ శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,జిల్లా నాయకులు జనార్ధన్,గ్రామ సర్పంచ్ సోమనారాయణ,మాజీ పీఎస్ఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,కోపరేటివ్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు బాలేoల విద్యాసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా సంఘం నాయకురాలు,పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.