సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె ఆగబోదు. ఆర్టీజన్ కార్మికులు
జోగులాంబ గద్వాల 13 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేతవరకు నిరవధిక సమ్మె ఆగబోదని ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మన్ కో చైర్మన్ శివప్రసాద్,పరమాల రాజు అన్నారు. ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె ఆరవ రోజుకు చేరుకున్న సందర్భంగా సోమవారం డివిజన్ కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోగా, యూనియన్ నాయకత్వాన్ని కార్మికులను బెదిరింపుల గురించి చేయడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని, గత పోరాటాల సందర్భంగా చెప్పిన మాటను అమలు చేయాలని తమ కోరుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమను ఎందుకు ప్రభుత్వం గుర్తించడం లేదో అర్థం కావడం లేదన్నారు. తాము తమ సమస్యల పరిష్కారంతోపాటు భవిష్యత్ తరాల కోసం విద్యుత్ ప్రైవేటికరణ వ్యతిరేకంగా, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని తమ పోరాటంలో డిమాండ్ గా ఉంచామని తమ న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ సమాజం అండగా నిలవాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.