గ్రామపంచాయతీలో ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి
గద్వాలఅదనపు కలెక్టర్ నర్సింగరావు.
జోగులాంబ గద్వాల 9 జూలై 2026 తెలంగాణ వార్త : ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత అభివృద్ధికి దోదపడే విధంగా మూడేండ్ల కార్యచరణ కు సమగ్ర వృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారము ఐ డి ఓ సి సమావేశ మందిరంలో. సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ సమగ్ర బుద్ధి ప్రణాళికను రూపొందించుటకై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాభివృద్ధి అనేది కీలకము నిర్మాణ పనులకు మాత్రమే గాక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రక్రియ శ్రీకరం చుట్టాలని తెలిపారు. త్రాగునీరు పరిశుద్ధం గ్రామీణ రహదారులు వీధి దీపాలు విద్యా ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ ఉపాధి మహిళా సాధికారిక యువత అభివృద్ధి వ్యవసాయం అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ గ్రామ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల సూచనలు స్థానిక అవసరాలు సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత క్రమంలో కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. వి బిజీ రాంజీ పథకం.16 ఆర్థిక సంఘం నిధులు స్వచ్ఛభారత్ జలసిరి తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు పథకాలకు సమన్వయంతో చేస్తే రాలేను అనుగుణంగా నిధులను. సహకరించి పనుల వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. వీటి సంరక్షణ ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రతి ఇంటి కి ఇంకుడు గుంతలు పరిగ రైతు పొలంలో నీటి కుంటలు. చెక్ డాములు తదితర వంటి పనులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ముసాయిదా బేగం జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్. జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.