గోడను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :- గోడను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి డ్రైనేజీ నీటితో పంట పొలాలు పాడవుతున్నాయనీ దళిత మహిళ పోలీసులకు పిర్యాదు.. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో డ్రైనేజీ, వర్షం నీటితో మా పంట పొలాలు పాడు అవుతుండడం తో గోడను కట్టగా కొందరు గోడ ను కూల్చి వేశారంటూ గ్రామానికి చెందిన బోల్లె లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో డ్రైనేజీ సక్రమంగా నిర్మాణం చేయకపోవడం కారణంగా వీధుల్లో వచ్చిన డ్రైనేజీ నీరు ఊరు వెంట ఉన్న మా పంట పొలంలో చేరి పంట పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా డ్రైనేజీ నీరుమా పంట పొలాలకు వెళ్లకుండా గోడ నిర్మించుకోగా ఆ గోడను అక్రమంగా కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఉన్న మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని గ్రామంలోని డ్రైనేజీ వర్షం నీరు కారణంగా పంటపాడవుతుందని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోనీ మాకు న్యాయం చేయాలంటూపోలీసులకు ఫిర్యాదు చేసి నట్లు తెలిపారు.