గద్వాల కోట చారిత్రక కట్టడాలను రక్షించి, భవిష్యత్ తరాలకు అందించాలి

గద్వాల ఘనకీర్తిని నేడు కబ్జాలతో కొందరు అప్రతిష్టపాలు చేస్తున్నారు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన గద్వాల మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలి.
మాజీ మున్సిపాల్ చైర్మన్ యెక్క కట్టడాలు, ఆస్తుల పై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. చారిత్రక కట్టడాలను కోట బావులను స్థలాలను కబ్జాలకు, ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాలని, కొత్తబావిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గద్వాల జిల్లా సమితి డిమాండ్ చేసింది. గద్వాల చారిత్రిక కట్టడాలు స్థలాలు బావులు కబ్జాలకు గురవుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపాలిటీ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ స్థలాలను బావులను కొల్లగొడుతున్న మాజీ మున్సిపాల్ చైర్మన్ వేణుగోపాల్ పై సమగ్ర విచారణ దర్యాప్తు చేసి నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ని కోరారు. ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ తో కొత్త బావి ఇతర స్థలాల విషయంలో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని అన్నారు రాజులు నిర్మించిన కోట, చారిత్రిక కట్టడాలతో మంచి పేరు గద్వాలకు వచ్చిందని వాటి రక్షణకు పునర్నిర్మాణం కొరకు పురావస్తు శాఖ, ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. భవిషత్ లో ఎలాంటి సంఘటనలు జరిగిన అధికారులకు నాయకులకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర మాజీ కార్యదర్శి డి రాము, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్కూర్ రంగన్న, సిపిఐ మండల నాయకులు ఖాసీం,AIYF జిల్లా అధ్యక్షులు బి పరమేష్, నాయకులు వెంకటన్న, గంగాధర్, కృష్ణ, కిరణ్ కుమార్ తదితులు పాల్గొన్నారు.