క్రిస్టమస్ పండుగ కానుకగా చీరల పంపిన చేసిన
సెయింట్ ఆన్స్ స్కూల్ కరస్పాండెంట్ విజయ దంపతులు

అడ్డగూడూరు నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలోని యస్సీ కాలనీలో 30 కుటుంబాల ఆడపడుచులకు చీరలు పంపిణి చేసిన సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల చైర్మన్ మరియన్న ప్రిన్సిపాల్ విజయ మాట్లాడుతూ..మా సొంత గ్రామం అయినటువంటి గోవిందపురం గ్రామంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి విద్యాసంస్థలను ప్రారంభించి వందలాది పేద,మధ్య,తరగతి విద్యార్థులకు చదువులకు భారం కాకుండా ఆర్థిక సహకారం అందించుకుంటూ పండుగల సందర్భాలలో ఆడపడుచులనే గుర్తు చేసుకుంటూ మాకు తోచిన సాయం చేసుకుంటూ ప్రజాసేవలో ముందడుగు వేసుకుంటూ వెళ్తున్న మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేసుకుంటూ పోతామని ఎవరికీ ఏ ఆపద వచ్చినా కూడా తోచిన సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వంగూరి పేతురు,బుర్రు అనిల్ కుమార్,పడిశాల ఇంద్రమ్మ, స్వప్న,సబితా,సోమనర్రా తదితరులు పాల్గొన్నారు.