కోదాడ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.

సూర్యాపేట 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈరోజు కోదాడ పట్టణంలో తిరంగాయాత్ర కార్యక్రమమును భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దేశంలో వివిధ రాజకీయ పక్షాలు, ధార్మిక సంస్థలు దేశ ప్రజలను కులాల పేరుతోను ,మతాల పేరుతోనూ, వర్గాల పేరుతోనూ విభజిస్తూ దేశాన్ని బలహీన పరచుటకు ప్రయత్నిస్తున్నారు. దానిని తిప్పి కొట్టే విధంగా భారతదేశంలోని ప్రజలందరూ మతాలకు, కులాలకు వర్గాలకు అతీతంగా త్రివర్ణ పతాకం కింద ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడుటకు మేమందరము ఒకటిగా ఉన్నాము అని తెలియజేయడంకు గాను ఈరోజు ఈ యొక్క తిరంగా యాత్ర చేయడం జరిగింది .దీని ద్వారా దేశంలోని విచ్ఛిన్నకర శక్తులకు ,విదేశీ శక్తులకు మా యొక్క ఐక్యతను దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ అలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఐక్యంగా ప్రతిగడిస్తామని సంకేతాన్నిస్తూ మేమంతా ఒకటే అని ఈ ప్రదర్శన ద్వారా తెలియజేసినాము. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి నూనె సులోచన, నియోజకవర్గం జాయింట్, కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య, మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు,రాష్ట్రనాయకులు ఓరుగంటి కిట్టు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఓరుగంటి పురుషోత్తం, జె ల్లా జనార్ధన్, నాగేంద్ర చారి ,వంగాల పిచ్చయ్య సాయి శర్మ, సెల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంపేట భాగ్యరాజు, దుగ్గి వెంకటేష్, పైడిమర్రి సతీష్, నాగేశ్వరరావు, రామారావు ఈశ్వర్ రావు వినాయకరావు, మతీన్ హుస్సేన్ యల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.