కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టానికి చేస్తున్న సవరణలను ఉపసంహరించుకోవాలి

Jul 9, 2026 - 17:20
Jul 9, 2026 - 17:20
 0  1
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టానికి చేస్తున్న సవరణలను ఉపసంహరించుకోవాలి

భువనగిరి 9 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా కేంద్రం సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ..జాతీయ ఆహార భద్రతా చట్టంకు (ఎన్ఎఫ్ఎస్ఏ)ప్రతిపాదించిన సవరణలను వెంటనే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్  డిమాండ్ చేస్తుంది.కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణ ద్వారా అంత్యోదయ అన్న యోజన(ఏఏవై)కింద ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ ప్రాతిపదిక అర్హత విధానాన్ని తొలగించి,వ్యక్తి ప్రాతిపదిక అర్హత విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగుల కుటుంబలపై తీవ్ర ప్రభావం పడుతుంది.ఒక్కో వ్యక్తికి 7 కిలోల ఆహార ధాన్యం ఇస్తామని చెప్పినా,పెద్ద కుటుంబాలకు దీనివల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారి మొత్తం కోటా ఇప్పటికీ నెలకు 35కిలోలకే పరిమితం అవుతుంది.అదే సమయంలో,చిన్న కుటుంబాలు ప్రస్తుతం పొందుతున్న 35కిలోల పూర్తి హక్కును కోల్పోతాయి. దీంతో సమాజంలోని అత్యంత పేద, బలహీన వర్గాలపై ఈ సవరణ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.వృద్ధ దంపతులు, వితంతువులు,దివ్యాంగులు, గిరిజన కుటుంబాలు,భూమిలేని వ్యవసాయ కార్మికులు,రోజువారీ కూలీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు,చిన్న కుటుంబాలు వంటి వర్గాలు కుటుంబ పరిమాణంతో సంబంధం లేకుండా ఏ.ఏ.వై పై ఆధారపడుతున్నాయి.ఈ సవరణ వారి ఆహార భద్రతను దెబ్బతీస్తుంది.ముఖ్యంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి,సగటు కుటుంబ పరిమాణాన్ని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలు ఈ సవరణ వల్ల నష్టపోతాయి.జనాభా నియంత్రణలో విజయాలు సాధించినప్పటికీ,వాటి మొత్తం ఆహార ధాన్య కేటాయింపులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.ఎన్నో సంవత్సరాలుగా, 2011 జనగణన ఆధారంగా ఉన్న ఎన్.ఎఫ్.ఎస్.ఏ లబ్ధిదారుల జాబితాను నవీకరించాలని విస్తృతంగా డిమాండ్ వస్తోంది.పాత జాబితాల కారణంగా లక్షలాది అర్హులైన ప్రజలు ఇప్పటికీ ఈ చట్టం ప్రయోజనాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుత జనాభా ఆధారంగా లబ్ధిదారుల జాబితాను నవీకరించి,చట్టం పరిధిని విస్తరించాల్సిన బదులు, మోదీ ప్రభుత్వం అత్యంత పేద ప్రజల ఆహారపు హక్కులను తగ్గించడానికి సవరణలు తీసుకురావడం సరైంది కాదు. కేంద్రం చేస్తున్న ఈ పేదప్రజల వ్యతిరేక సవరణ ద్వారా,ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా ఆహారాన్ని చట్టబద్ధ హక్కుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని క్రమంగా బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని ఢిల్లీ హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరైంది కాదు. అంత్యోదయ రేషన్ కార్డ్స్ ద్వారా లక్షలాది మంది వికలాంగుల కుటుంబాలు లబ్దిపొందుతూన్నాయని వాటిని రద్దు చేయడం అంటే వికలాంగుల ఆహార భద్రతను దోచుకోవడమే అవుతుంది. తక్షణమే కేంద్రం చేస్తున్న సవరణలు విరమించుకోవాలని లేని యెడల వికలాంగులు, పేదలను సమీకరించి ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.