కార్మికులే దేశ ప్రగతికి మెట్లు..సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్ 

May 1, 2026 - 18:24
 0  70
కార్మికులే దేశ ప్రగతికి మెట్లు..సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్ 

అడ్డగూడూరు 01 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే దినోత్సవని కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు రోడ్ల మీదకు వచ్చి తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో అప్పటినుండి ప్రభుత్వం కార్మికుల పైన కాల్పులు జరిపి వేలాదిమంది కార్మికుల రక్తంతో తడిసిన గుడ్డ ఎర్ర జెండగా మరి అప్పటి నుంచి కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది అన్ని అన్నారు.12గంటల పని విధానం తగ్గించాలని పోరాటం చేస్తున్నది సీఐటీయూ అన్ని అన్నారు అదే విధంగా భవన నిర్మాణ సంఘానికి సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ సంఘ నాయకులను ఆదుకోవాలని అన్నారు,రాష్టంలో క్రియశీలకంగా పనిచేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికులకు నెలకు 22,వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ లను డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో తాపీ మెస్ట్రీ సంఘం మండల అధ్యక్షులు గజ్జెలి కృష్ణ,గ్రామ పంచాయితీ కార్మికుల మండల అధ్యక్షులు బాలెంల మల్లయ్య,గౌరవ అధ్యక్షులు గజ్జెలి రవి,హమ్మలి సంఘం మండల అధ్యక్షులు చిన్నం మహకలి,బోడ నర్సింహ,బోడ పాండు, చుక్క అంజయ్య,పనికేర సత్తయ్య,బాలెంల యాదగిరి,బోడ ఉత్తరయ్య,గుడెపు కోమరెల్లి,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333