కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి: గంట కవిత దేవి
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల .-కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితా దేవి అన్నారు.ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఇబ్బంది పడొద్దు అని సూచించారు. బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరారు. తమ భవిష్యత్తు బంగారులా చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ హెడ్మాస్టర్ విజయలక్ష్మి,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, మరియు డిఎల్ఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.