ఒక విద్యార్థి.. ఒక టీచర్

Jun 23, 2026 - 16:45
 0  2
ఒక విద్యార్థి.. ఒక టీచర్

గాంధీనగర్ పాఠశాల పరిస్థితి

ఒక్కరి కోసమే బడి

ఊరిలో 55 కుటుంబాలు ఉన్నా.. సర్కారు బడికి వస్తున్నది మాత్రం ఒకే ఒక్క విద్యార్థి. ఆ స్టూడెంట్ కు పాఠాలు చెప్పడా నికి ఒక టీచర్ ఉన్నారు. ప్రైవేట్ బడుల మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను ఏ స్థాయిలో పక్కనపెడుతున్నారో చెప్పేందుకు మేళ్లచెరువు మండలం గాంధీనగర్ తండా పాఠశాల పరిస్థితి నిదర్శనంగా నిలుస్తున్నది. గతేడాది కేవలం ముగ్గురు విద్యార్థు లతోనే స్కూల్ ను నడిపారు. ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఐదో తరగతి పూర్తి చేసుకొని ఇతర పాఠశాలలకు వెళ్లారని, దీంతో ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న ఒక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు హాజరవుతున్నాడని ఉపాధ్యాయుడు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333