ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం సిఐ రఘువీర్ రెడ్డి

తిరుమలగిరి 06 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చని సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు తిరుమలగిరి మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమానికి ఎస్సై వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సిఐ రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సిసి కెమెరాలు ఏర్పాటుపై పట్టణ వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయి తెలిపారు అలాగే రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు నివారణకు రోడ్డు ప్రమాదంలో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు కనుక ప్రధాన రహదారుల పక్కన వ్యాపారుల సముదాయాలు నిర్వహించుకునే తమ షాపులలో ఎదుట సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి నిర్మాణం బాధ్యత కూడా వ్యాపారులు చూసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటుకు వ్యాపారస్తులు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్ ఎస్ఐ తేజస్విని డిటి జాన్ మొహమ్మద్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి మరియు వ్యాపారస్తులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు