ఎర్రవల్లి మండలానికి 98 శాతం టెక్స్ట్ బుక్స్ చేరిక

Jun 8, 2026 - 19:52
 0  42
ఎర్రవల్లి మండలానికి 98 శాతం టెక్స్ట్ బుక్స్ చేరిక
ఎర్రవల్లి మండలానికి 98 శాతం టెక్స్ట్ బుక్స్ చేరిక

 జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎర్రవల్లి.  మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులక అవసరమైన టెక్స్ట్ బుక్స్‌లో 98 శాతం పుస్తకాలు మండలానికి చేరుకున్నాయని మండల విద్యాశాఖ అధికారి శ్రీ.J అమీర్ పాష తెలిపారు.

మొదటి విడతలో భాగంగా  PART -01 మొత్తం 12,903 టెక్స్ట్ బుక్స్ మండల విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నాయని, వాటిని నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (PS), ప్రాథమికోన్నత పాఠశాలలు (UPS), ఉన్నత పాఠశాలలు (ZPHS) మరియు కేజీబీవీ పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 10వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమం ప్రారంభమై అన్ని పాఠశాలలకు పుస్తకాల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖాజా, సీఆర్పీలు శ్రీనివాసులు, రాణి తదితరులు పాల్గొని పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంఈఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333