ఎక్స్‌అఫిషియో'పై గత తీర్పును అమలు చేయండి: హైకోర్టు

Feb 8, 2026 - 19:15
Feb 8, 2026 - 19:16
 0  2
ఎక్స్‌అఫిషియో'పై గత తీర్పును అమలు చేయండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా ఎక్స్‌అఫిషియో సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడంపై గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ జారీచేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సింగిల్‌ జడ్జి స్పష్టంచేశారు.

ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు వారి నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మున్సిపాలిటీల్లో ఓటు హకు వినియోగించుకోవాలని గతంలో ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎక్స్‌అఫిషియో సభ్యులు ఎవరెవరు ఓటు వేయాలనేది మున్సిపల్‌ చట్టసభ్యులు ఎంచుకోవాలని ప్రజాప్రతినిధులకు నిర్మల్‌ కలెక్టర్‌ లేఖ రాయడాన్ని సవాలు చేస్తూ కత్తి నరేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333