ఉల్లాస్- అమ్మకు అక్షర మాల కార్యక్రమం నిర్వహించిన ఏపీవో ధనుంజయ రాజు ధనుంజయ రాజు

Mar 29, 2026 - 18:31
Mar 29, 2026 - 18:36
 0  0
ఉల్లాస్- అమ్మకు అక్షర మాల కార్యక్రమం నిర్వహించిన ఏపీవో ధనుంజయ రాజు ధనుంజయ రాజు

29-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం :  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన దగడపల్లి ప్రాథమిక పాఠశాలలో  ఉల్లాస్ అమ్మకు అక్షరా మాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఏపీఓ ధనుంజయ రాజు. ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతం

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన “ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల” పరీక్షా కేంద్రాన్ని ఏపీఓ ధనుంజయ రాజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, హాజరు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ, సెర్ఫ్, మెప్మా, జిల్లా విద్యాశాఖల సంయుక్త భాగస్వామ్యంతో మండలంలోని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించగా, అభ్యాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఏపీఓ ధనుంజయ రాజు మాట్లాడుతూ, మండలంలో వివిధ గ్రామాలలో మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించడం ద్వారా స్వయం అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. ప్రతి మహిళా విద్య ద్వారా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీవో, ఫీల్డ్ అసిస్టెంట్ భారతి, బుక్కీ పర్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State