ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Jun 10, 2026 - 00:03
 0  1
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జోగులాంబ గద్వాల 9 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను ఈవీఎంల నెలవారి సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. సందర్శనలో భాగంగా తనిఖీ రిజిస్టర్ లలో కలెక్టర్ సంతకాలు చేశారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మంజుల, గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333