ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది.
పేదల మొహంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయం..
రేవంతన్న, ఉత్తమన్న ఆశీస్సులతో ముందుకెళ్తున్న
ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు తెలిపారు.
మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండలంలోని మక్త కొత్తగూడెం గ్రామంలో పూర్తి చేసుకున్న 6 కుటుంబాల లబ్దిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు:-
1. కోట పద్మ ప్రభాకర్
2. తిపర్తి రమణ ఎల్లేష్
3. కాసాని శైలజ గణేష్
4. సంగెం జ్యోతి
5. కల్పగిరి శ్రీదేవి నాగయ్య
6. గుండాల భారతి మల్లయ్య
అనంతరం సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని 175 ఇండ్లను మంజూరు చేసి 80 ఇండ్లను పూర్తి చేసుకొని గృహప్రవేశం చేశారన్నారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు.
గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా INTUC అధ్యక్షుడు కాసాని పాపయ్య గౌడ్,పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాషాపంగు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పచ్చిపాల వెంకన్న, కాసాని సత్యం,కోట ప్రభాకర్, తిపర్తి సతీష్, ఉప్పల చిన్న లింగయ్య, బద్దం రంగారెడ్డి, పారాల ఎల్లయ్య, గడ్డం రాములు, వెంకన్న, ఉప్పలయ్య, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, నాగు నాయక్, పంతంగి దశరథ, మిడితనపల్లి సర్పంచ్ సురేష్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు ముస్కు రామచంద్ర రెడ్డి, జమండ్ల సత్యనారాయణ రెడ్డి, మూల ఎల్లయ్య, సామ ఉపేందర్ రెడ్డి, పాల్గొన్నారు.