దివ్య క్షేత్రంభద్రాచలం మాడవీధులకు శ్రీరామ మాడ వీధులు గా నామకరణం చేయండి

Apr 15, 2026 - 19:46
Apr 15, 2026 - 21:24
 0  1
దివ్య క్షేత్రంభద్రాచలం మాడవీధులకు శ్రీరామ మాడ వీధులు గా నామకరణం చేయండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రామభక్తుల విజ్ఞప్తి. 

తెలంగాణవార్త ఏప్రిల్ 15 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి. శ్రీనివాస రెడ్డి కి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు కి భద్రాచలం పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాడవీధులను శ్రీరామ మాడవీధులుగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు . భక్త రామదాసు ని గోల్కొండ బంధికానా నుండి విడిపించుటకు సాక్షాత్తు రామలక్ష్మణులు, రామోజీ, లక్ష్మో జీ పేర్లతో నైజాం నవాబు తానీషా కు చెల్లించిన సువర్ణ మాడలను నైజాం (తెలంగాణ) వాడుక భాషలో శ్రీరామ మాడలుగా ఆనాడే అభివర్ణించారని, ఈనాటికి భద్రాద్రి వచ్చిన భక్తులు శ్రీరామ మాడలను దర్శించుకుంటారని, భక్త రామదాసు కాలం నాటి శ్రీరామ మాడల పేర్లు సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు గుర్తుండి పోయే విధంగా భద్రాచలం మాడవీధులకు శ్రీరామ మాడవీధులుగా నామకరణం చేయాలని శ్రీరామ భక్తులు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. 

ఈ విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి త్రయం (త్రిమూర్తులు) శ్రీరామ మాడవీధుల పేరుతో విస్తరణ చేసి శ్రీరామ కార్యంలో పాల్గొనాలని రామ భక్తులు కోరుతున్నారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333