ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ నెమ్మికల్ ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి పరీక్ష విధానాన్ని తనిఖీ చేశారు. కళాశాల ఆవరణలో వృధాగా పడి ఉన్న బెంచీలను స్టోర్ రూము లో భద్రపరచమని కళాశాల యాజమాన్యానికి ఆదేశించారు. మండల వైద్య శాఖ వారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కేంద్రం ను పరిశీలించారు.అనంతరం పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో విద్యార్థులు పరీక్షలు రాసే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట ఫ్లయింగ్ స్క్వాడ్.వి డి ఎస్ ప్రసాద్, తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, డి ఇ సి అధికారులు జె. కృష్ణయ్య, జి.లక్ష్మయ్య, అర్ ఐ ప్రదీప్ రెడ్డి, లు ఉన్నారు.మొత్తం 263 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటి రోజు 17 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యరని పరీక్ష కేంద్రం ప్రధానాధికారి గుణగంటి వెంకటేశ్వర్లు తెలిపారు.