ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌ను జయప్రదం చేయండి..

Mar 24, 2026 - 19:52
 0  1
ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌ను జయప్రదం చేయండి..

ఈనెల 26న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌ను జయప్రదం చేయండి..  -PDSU

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ఇవ్వాల్సిన 218 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈనెల 25, 26 తేదీలలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల బంద్‌కు పి.డి.ఎస్.యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది.పి.డి.ఎస్.యు ఆధ్వరంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో  జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ , ప్రైవేటు యాజమాన్యంలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్ మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.7 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, అది విద్యార్థుల అవసరాలకు సరిపోదని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని  విమర్శించారు. పేద విద్యార్థులు స్కాలర్షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రైవేటు కాలేజీలు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలపై మొండి వైఖరి ప్రదర్శిస్తోందని పిడిఎస్యు నాయకులు ఆరోపించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈనెల 25, 26 తేదీలలో డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, బీఈడీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలని పిడిఎస్యు పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు కూడా ఈ బంద్‌కు సహకరించాలని కోరారు... అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే పిడిఎస్యు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేని పక్షంలో ఈ జిల్లాల ఎమ్మెల్యే ,మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం. వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు..  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సందీప్, మహేష్, వినయ్, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333