ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి నియామకం
తెలంగాణ వార్త జూన్01 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెలంగాణా రాష్ట్ర కమిటీ కే.ఎస్.వి. ఆర్.ఆర్.కుమార్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ గా మరియు రామావజ్జల. రవికుమార్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించింది. ఈ సందర్బంగా జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ., ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిట్స్ ఫెడరేషన్ తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్ట్ ల సమస్య ల పై రాజీ లేని పోరాటం చేస్తున్నదని అదేవిదంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.