ఆగని చెరువు మట్టి తవ్వకాలు

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ ఏదేచ్ఛగా చెరువు మట్టి తవ్వకాలు. ఇళ్లలో పోసుకున్నారు అంటున్న ఇరిగేషన్ అధికారులు.. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని ఏపూరు గ్రామంలోని సుబ్బ సముద్రం చెరువు నుండి శుక్రవారం జెసిబి లు ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టి తరలిస్తున్నారు. కొంతమంది ప్లాట్ లో ను మరి కొందరు ఇల్లలోను రోడ్ల వెంట మట్టిని పోసుకుంటున్నారు. చెరువు లో మట్టి వ్యవసాయ భూములకు రైతులు ఇరిగేషన్ అనుమతుల తో వాడుకోవాల్సి ఉండగా ఇస్తాను సారంగా చెరువు నుండి మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టిని గ్రామస్తులే వాడుకుంటున్నారని వ్యాపారానికి కాదని ఇరిగేషన్ డి ఈ నగేశ్ తెలిపారు.