అర్ధరాత్రి హత్యకు పాల్పడ్డ దుండగులు
సూర్యాపేట జిల్లా కేంద్రం లో దారుణ హత్య కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య నగర్ భుక్య విజయ్ ,(28) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు నిద్రిస్తుండగా దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.