అమాలి వర్కర్లలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి

తెలంగాణ వార్త మాడుగులపల్లి ఫిబ్రవరి 25 : గోదాములలో పనిచేసే హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి . రొoడి శ్రీనివాస్, మాడుగులపల్లి మండలంలోని కుక్కడం కొత్తగూడెం గోదాములలో సుమారు 1000 మంది హమాలీలుగా పనిచేస్తున్నారు. హమాలీల మేస్తిర్ల సమావేశం సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్, మాట్లాడుతూ మాడుగుల పల్లిమండల పరిధిలోని గోదాములలో అనగా కుక్కడం కొత్తగూడెం మరియు రైస్ మిల్లులలో ఐకెపి సెంటర్లలో హమాలీలుగా సుమారు 3000 మంది వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి వీరికి ఎలాంటి సౌకర్యాలు అనగా ప్రమాద బీమా గాని పీఎఫ్ సౌకర్యం గాని ఈఎస్ఐ సౌకర్యంగానే లేనటువంటి పరిస్థితి అలాగే గోదాములలో పని చేస్తున్నటువంటి హమాలీలు కరోనా టైం లో కూడా ఎఫ్ సి ఐ బియ్యం ప్రజలకు అందించాలి అని ప్రభుత్వం కోరితే వాళ్ల ప్రాణాలను లెక్కచేయకుండా గోదాములలో ఉన్నటువంటి బియ్యాన్ని లారీలకు లోడు చేసి ఇతర ప్రదేశాలకు పంపించినటువంటి ఘనత గోదాం హమాలీలకు ఉన్నది మరి వారికి సంబంధించిన ఆరోగ్య విషయాలకైతేనేమి, ప్రావిడెంటు ఫండ్ అయితేనేమి, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే వారికి గాని వారి కుటుంబానికి గాని అండగా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం గోదాం మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి ఈ హమాలీల సంక్షేమం కోసం పాటుపడాలి అని కోరినారు కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్ష లుకార్యదర్శులు హమాలీలు పాల్గొన్నారు.