అనాధ పిల్లల ఆశ్రమాన్ని వీక్షించిన కమాండెంట్ ఎన్.వి సాంబయ్య
జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవలి ఏడీజీపీ స్వాతి లక్రా ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా శనివారం పదవ బెటాలియన్ కమాండెంట్ మరియు సిబ్బంది గద్వాలలో ఉన్న అనాధ పిల్లల ఆశ్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ సాంబయ్య చేతులమీదుగా వారికి డిక్షనరీలు, ఛార్ట్స్, బుక్స్ డైనింగ్ టేబుల్స్, షూస్, పెన్స్, పెన్సిల్స్ మరియు తిను బండారాలు పండ్లు, బిస్కెట్స్ పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.