అనాధలకు భిక్షాటకులకు దుప్పట్ల పంపిణీ

Aug 13, 2024 - 20:56
Aug 13, 2024 - 21:35
 0  37
 అనాధలకు భిక్షాటకులకు దుప్పట్ల పంపిణీ
 అనాధలకు భిక్షాటకులకు దుప్పట్ల పంపిణీ

కోదాడ,ఆగష్టు 13 స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో,పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేస్తున్న యాచకులు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకురాలు అంకతి అనసూర్య ముఖ్యఅతిథిగా పాల్గొని భిక్షాటకులకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చలికాలం వర్షాకాలం దోమలకాలం కాబట్టి దిక్కులేని అనాధలకు భిక్షాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరినీ ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి అనాధలను వృద్ధులను భిక్షాటకులను ఆదుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలోన వొస్ స్వచ్ఛంద పేరు సేవా సంస్థ వ్యవస్థాపకులు సంజీవరాజు ,ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు,కృష్ణమూర్తి,పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333