అనంతరంలో జన గణన పై అవగాహన

Apr 29, 2026 - 21:58
 0  1
అనంతరంలో జన గణన పై అవగాహన

  తిరుమలగిరి 30 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 జనగణన-2027 ఫీల్డ్ ట్రైనింగ్ నిర్వహణ ... 

 తహసీల్దార్ ప్రత్యక్ష పర్యవేక్షణ... 

 జనగణన-2027లో భాగంగా తిరుమలగిరి మండలంలో ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయి శిక్షణ బుధవారం నిర్వహించారు. తహసీల్దార్ బషెట్టి హరిప్రసాద్ స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి శిక్షణను పర్యవేక్షించారు.ఏప్రిల్ 27 నుండి 29 వరకు మోడల్ స్కూల్, అనంతారం నందు జరుగుతున్న శిక్షణలో భాగంగా, సిబ్బందిని గ్రామాల్లోని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి హౌస్ నంబరింగ్, హౌస్ లిస్టింగ్, కుటుంబ వివరాల సేకరణ విధానాలను ప్రత్యక్షంగా చూపించారు. జనగణన మొబైల్ యాప్ వినియోగం, సమాచార నమోదు, ఎదురయ్యే సందేహాల నివృత్తిపై క్షేత్రస్థాయిలోనే అవగాహన కల్పించారు. ఎంపీఎస్ఓ కిషన్ మలోత్, ఫీల్డ్ ట్రైనర్లు కె. అశోక్ రెడ్డి, కె. సత్యనారాయణ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ టి. నరేందర్ లు 6 మంది సూపర్‌వైజర్లు, 42 మంది ఎన్యుమరేటర్లతో కలిసి ఫీల్డ్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ బషెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ, అనేది దేశానికి ఎంతో ముఖ్యం. ఫీల్డ్‌లో ఎటువంటి తప్పులు లేకుండా 100% కచ్చితమైన సమాచారం సేకరించాలి. ప్రతి ఇంటిని కవర్ చేయాలి" అని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి