ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు కలెక్టర్
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ...
నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ...
తహశీల్దార్లతో పాటు, ఎంపీడీవో, ఏఈవో లకు షోకాజ్ నోటీసులు ...
మండల ప్రొక్యూర్మెంట్ కమిటీ నుండి సంజాయిషీ ...
కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ ...
తిరుమలగిరి 30 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు ఎట్టి పరిస్తితుల్లో సహించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఉపేక్షించారు. తుంగతుర్తి తహశీల్దార్ దయనంద్, తిరుమలగిరి తహశీల్దార్ హరి ప్రసాద్, ఎంపిడివో శేషు కుమార్, మండల వ్యవసాయ అధికారి తుంగతుర్తి రమేష్ బాబు, గొట్టిపర్తి ఏఈఓ జోత్స్న తుంగతుర్తి ఏపిఎం ఎం.యాదమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో రైతుల పేరిట విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం విచారణ చేపట్టి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.