అండర్ డ్రైనేజీ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి
టిఆర్పీ పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు డిమాండ్
గుంతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలు
సూర్యాపేట 29 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- పట్టణంలో గత కొన్ని నెలలుగా చేపడుతున్న డ్రైనేజీ మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టిఆర్పీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో గత నవంబర్ నెలలో అండర్ డ్రైనేజీ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించినా గాని ఇప్పటివరకు 48 వార్డులలో ఏ వీధి చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. అండర్ డ్రైనేజీ మరమ్మతులకు సంబంధించి పార్టీ ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నుంచి వర్షాలు ప్రారంభం కానుండడం, పాఠశాలలు కూడా జూన్ 12 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉండటంతో స్కూల్ వాహనాలు, విద్యార్థిని, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని వర్షాలు ప్రారంభం కాకముందే అండర్ డ్రైనేజీ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనియెడల టిఆర్పీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమ గాని లింగస్వామి, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్, వల్లాల సైదులు, ఆరాల రమేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సూపర్ సైదులు, బోడపట్ల మధు గౌడ్, చింతల మురళి, వట్యాల శేఖర్,కాంటేకార్ రఘుమోహన్, కోటేష్, విజయ్, వంశీ, అనిల్, మురళి, ఉడుత పవన్, కుమార్ రాజు, కోలగాని వెంకన్న, చాంప్ల, పవన్, దీపమాల, వర్రె కవిత యాదవ్, గుండారపు సంజన ఆర్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు