మానవపాడులో విషాదం.. వాటర్ హీటర్ షాక్ తో వివాహిత మృతి

Jul 16, 2026 - 20:34
Jul 16, 2026 - 22:52
 0  2
మానవపాడులో విషాదం.. వాటర్ హీటర్ షాక్ తో వివాహిత మృతి

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో విషాదం చోటు చేసుకుంది. వాటర్ హీటర్ కు కరెంట్ షాక్ తగిలి 26 ఏళ్ల వివాహిత మంజుల భాయి మృతి చెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. మంజుల భాయి స్నానం చేయడానికి బాత్రూం కి వెళ్లారు. ఆ సమయంలో వాటర్ హీటర్ లో ప్రమాదవశాత్తు కరెంట్ లీక్ అయింది. దీంతో ఆమెకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State