భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆస్థాన పౌరోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయండి

Jul 16, 2026 - 20:32
 0  0
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆస్థాన పౌరోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయండి

గౌ,,ముఖ్యమంత్రికి బ్రాహ్మణ సమాజం విజ్ఞప్తి.

తెలంగాణ వార్త  జూలై 16 . జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : గత 150 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వశిష్ట సమానమైన ఆస్థాన పురోహితునిగా వైదిక బ్రాహ్మణ సమాజానకి చెందిన వారిని నియమించ డంఆనవాయితీగా వస్తోంది. 
ఈమధ్య దేవస్థానం వారు విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ వైదిక బ్రాహ్మణసమాజాని కివిరుద్ధంగాఉన్నట్లు ఈవర్గంవారు అభిప్రాయపడుతున్నారు.  వైదిక బ్రాహ్మణ సమాజం నుండి కోవూరు.విశ్వనాథ శాస్త్రి, వజ్జల. రామచంద్రయ్య, కోటేశ్వరశర్మ , చల్లా. కోదండరామయ్య శర్మ, చెన్నా వజ్జల. వెంకటేశ్వరా వధాని,మొదలగు వారు భద్రాచలం రామాలయంలో ఆస్థాన పురోహితులుగా బాధ్యతలు నిర్వర్తించారు. రామాలయం ఆస్థాన పురోహితులు రిటైర్ అయి మూడున్నర సంవత్సరాలు అవు తున్నా, అత్యంత ప్రధానమైన వశిష్ట సమానమైన ఆస్థాన పురోహితుని పోస్ట్  ఫిలప్ కాకుండా వైదిక బ్రాహ్మణ ద్వేషులు కుట్రలు పన్నారని సందేహించాల్సి వస్తోందని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు & భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు అయిన రామావఝల. రవికుమార్ ఆరోపించారు. ఆస్థాన పురోహితుని పోస్టు నియామకం నిలుపుదల చేయాలని రవికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో ఉన్నందున ఆస్థాన పురోహిత పోస్ట్ నియామకం నిలుపుదల చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ మంత్రివర్యులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన త్రిమూర్తులకు (ముగ్గురు మంత్రులు) భద్రాచలం శాసనసభ్యునికి, గౌరవ ముఖ్యమంత్రి కి కూడా లేఖల ద్వారా తెలియచేయడం జరిగిందని రామావఝల. రవికుమార్ తెలిపారు. బ్రాహ్మణ సమాజాభి మానులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి ఈ పోస్ట్ వివాదం ఉన్నత న్యాయస్థానంలో ఉన్నందున ఈ నియామకాన్ని నిలుపుదల చేసి వైదికబ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయవలసినదిగా బ్రాహ్మణ సమాజం వారువిజ్ఞప్తి చేశారు.  
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333