భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీంలను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్
అడ్డగూడూరు 06 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పుతూ..జారీ చేసిన జీవో నెంబర్ 12 ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, సిఎస్ సి హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం రోజున అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో 50 మంది ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ వారికి ఏఐటీయూసీ కండువాను కప్పి యూనియన్ లోకి సాధారణంగా ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ.. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం,శాశ్విత,పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేననీ అన్నారు.. సిఎస్ సి హెల్త్ కేర్ టెస్టుల వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు లేవని మళ్లీ వైద్యం కోసం వెళితే ఏ హాస్పిటల్ వాళ్ళు అయిన టెస్టులు చేసిన తర్వాతనే వైద్యం చేస్తున్నారని కావున వెంటనే సిఎస్సి సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగా కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2వేల 309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎస్ సి హెల్త్ చెకప్ పేరుతో 500 కోట్లు కాజేశారని అన్నారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి అధికారులకు లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణరంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే.ప్రయత్నాలు విరవించుకోవాలని కోరారు. భవనిర్మాణ కార్మికులు సహజమరనానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని 50 ఏళ్లు దాటిన కార్మికులకు రూ. 5 వేలు కనీస పెన్షన్ ఇవ్వాలని, వివాహ, కానుపు స్కీం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారునూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా సుంకరబోయిన కొమురయ్య ఉపాధ్యక్షులు భాషబోయిన కనకయ్య, షేక్ జహంగీర్ ప్రధాన కార్యదర్శి:- కందుకూరి పరశురాములు,
సహాయ కార్యదర్శులు కొండాపురం నర్సయ్య, కందుకూరి అంజయ్య కోశాధికారి చేడే సుందరయ్య
లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయిందని అన్నారు.