పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం....చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది....

Mar 7, 2026 - 19:53
 0  1
పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం....చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది....

మహిళా దినోత్సవం సందర్భంగా 15 మంది మహిళ పారిశుధ్య కార్మికులకు సత్కారం....

 సూర్యాపేట
“పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వారి సేవలు సమాజానికి అమూల్యమైనవని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా  సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది మహిళ పారిశుధ్య కార్మికులను చైర్‌పర్సన్  సత్కరించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణానికి అనుకూలమైన వస్తువులను ఉపయోగించే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళ పారిశుధ్య కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  సిఏచ్. హన్మంతరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ షఫీ ఉల్లా, మేనేజర్ బుచ్చిబాబు, ఆర్వో కళ్యాణి, టీపీవో సోమయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్లు సారగాండ్ల శ్రీనివాస్, యాదగిరి, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, టీఎంసీ శ్వేతా, సీఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333