న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

May 2, 2026 - 20:32
 0  1
న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

పోలీసుల వద్దకు వెళ్ళితే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని  ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఇన్స్ స్పెక్టర్ల నుండి ఏసీపీ లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, నిరంతరం క్రింది స్థాయి అధికారుల పని తీరును పర్యవేక్షణ చేయడంతో వారి దిశా నిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవం మర్యాదలు పెంపొందించే విధంగా వెదురు నిర్వర్తించాలని సిపి అధికారులకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333