నిలిచిపోయిన రోడ్డు పనులు వెంటనే పూర్తిచేయాలని ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్,విజెఎస్ నాయకులు
అడ్డగూడూరు 03 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– గురజాల నుండి జానకిపురం వరకు శంకుస్థాపన చేసి వదిలి వేసిన బిటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఏఐఎస్ఎఫ్,విజెఎస్ ఆధ్వర్యంలో మానాయకుంట ఎక్స్ రోడ్ నుండి అడ్డగూడూరు తాసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది.అనంతరం స్థానిక తహసిల్దార్ శేషగిరిరావుకి మెమొరండం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ..నిలిచిన రోడ్డు పనులు ప్రారంభించాలని మే 20వ తేదీన మానాయకుంట ఎక్స్ రోడ్లో ధర్నా నిర్వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే , స్థానిక ఎంపీ స్పందించి రోడ్లు భవనాలు శాఖ మాత్యుల సహకారంతో ఈ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.మూడు జిల్లాలను అనుసంధానం చేసే ఈ రహదారి పనులు నిలిచిపోవడంతో ప్రజలు,వాహనదారులు,విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు గుంతలు గుంతలుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయని,రానున్న వర్షాకాలంలో రైతులు కూలీలు విద్యార్థులు ఈ గుంతల రోడ్లో ఇబ్బందులు పడుతారని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకొని రోడ్డు పనులు పూర్తిచేసి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
విజిఎస్ ఓయూ అధ్యక్షులు చెరుకు శివరాజ్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయకపోతే విడతల వారీగా వెల్దేవి,గట్టుసింగారం, మానాయికుంట గ్రామాల ప్రజలను ఏకం చేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఉప్పుల కర్ణాకర్,వంశీ,నిఖిల్,మురళి వి జెఎస్ నాయకులు లక్ష్మీ సాయి , సంజు,ముఖేష్,లోకేష్ బి ఆర్ఎస్వి నాయకులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.