డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

Jun 22, 2026 - 22:28
 0  4
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలి  సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలి  సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

యాంటీ డ్రగ్ సోల్జర్ (Anti Drug Soldier) నమోదు ప్రక్రియను, డ్రగ్స్ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ.

సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, అందరూ భాగస్వామ్యం కావాలి.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడిగా నిలబడి పోరాడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ ఈగల్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "యాంటీ డ్రగ్ సోల్జర్" (Anti Drug Soldier) పౌరుల నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ప్రతి పౌరుడు, యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహ చారి, మరియు స్థానిక ఇన్స్పెక్టర్లతో కలిసి ఎస్పీ గారు డ్రగ్స్ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు మాట్లాడుతూ గంజాయి లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరారు. మన సమాజాన్ని, సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖతో ప్రజలు చేతులు కలపాలన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక, రవాణా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని కోరారు. "సే నో టు డ్రగ్స్ - సే ఎస్ టు లైఫ్" (Say No to Drugs - Say Yes to Life) అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, మత్తుకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ, అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలని ఎస్పీ సూచించారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలకు అలవాటు పడిన వారిని సంస్కరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని దీనికోసం జిల్లా వ్యాప్తంగా గంజాయి సంభంద కేసుల్లో ఉన్న యువకులకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సత్ప్రవర్తన కోసం జిల్లా కేంద్రంలో పునరావత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని. డ్రగ్స్ వినియోగము రవాణా కు సంబంధించిన సమాచారాన్ని 100, 112, 1908 లకు తెలియజేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహ చారి, DCRB ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ఎస్ఐ యాకూబ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333