గోదావరిఖని  కృష్ణవేణి విద్యాసంస్థలకు జాతీయ స్థాయి ప్రథమ అవార్డు

Apr 18, 2026 - 18:34
Apr 18, 2026 - 18:47
 0  5
గోదావరిఖని  కృష్ణవేణి విద్యాసంస్థలకు జాతీయ స్థాయి ప్రథమ అవార్డు
గోదావరిఖని  కృష్ణవేణి విద్యాసంస్థలకు జాతీయ స్థాయి ప్రథమ అవార్డు

గోదావరిఖని 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి : రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కృష్ణవేణి విద్యాసంస్థలు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందాయి. లీడ్ ఎక్సలెన్సీ ఇండియా సంస్థ వారు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన జాతీయ శిక్ష అవార్డుల్లో కృష్ణవేణి విద్యాసంస్థలు ప్రథమ స్థానం లో నిలిచింది. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరియు ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలపై నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సర్వేలో కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కనబరిచిన ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయిలో మొదటి స్థానానికి ఎంపిక చేశారు. హైదరాబాదులోని నోవోటేల్ హోటల్‌లో జరిగిన  కార్యక్రమంలో కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రామకృష్ణ , రాజిరెడ్డి , సత్యనారాయణ , శైలజ  ప్రముఖుల సమక్షంలో అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును జాతీయ లీడ్ గ్రూప్ సీఈవో సుమిత్ మెహతా  మరియు సౌత్ జోన్ ఇంచార్జ్  శ్రీకాంత్ వర్మ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ, “ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల ప్రతిభ మరియు తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణాలు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాము” అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రామగుండం ప్రాంతానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, కృష్ణవేణి విద్యాసంస్థల విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచింది.

Mahesh Staff Reporter GODAVARI KHANI