32వ వార్డు శ్రీరాంనగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ

Jun 20, 2026 - 19:15
 0  0
32వ వార్డు శ్రీరాంనగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ
32వ వార్డు శ్రీరాంనగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ

స్థానిక 32వ వార్డు శ్రీరాంనగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. AICC సభ్యులు శ్రీరాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి అదేశానుసారం వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్న పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా బాలామృతం, గుడ్లు, పాలు పంపిణీ చేశారు. దీనితో పాటు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్‌ను కూడా అందజేశారు. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, ప్రతి పిల్లాడికి ప్రభుత్వం అందించే పోషకాలు అందాలనే లక్ష్యంతోనే వార్డులో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని కౌన్సిలర్ కుంభం రాజేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333